Mancherial: చెన్నూర్‌లో భారీగా గంజాయి మొక్కలు సీజ్.. ఇద్దరు నిందితుల అరెస్ట్
Mancherial: మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తూ మహారాష్ట్రకు చెందిన ఇద్దరి నుంచి 354 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు.
Mancherial: చెన్నూర్‌లో భారీగా గంజాయి మొక్కలు సీజ్.. ఇద్దరు నిందితుల అరెస్ట్
మంచిర్యాల జిల్లా: పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించగా వారి వివరాలు ఆరా తీయగా వారు మహారాష్ట్రకు చెందిన వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు.
వారిని తనిఖీ చేయగా వారి వద్ద నుండి మొత్తం 354 గంజాయి మొక్కలను గుర్తించారు. ఒకరి వద్ద 4 పెద్ద గంజాయి మొక్కలు గుర్తించిన పోలీసులు, మరో వ్యక్తి వద్ద నుండి 350 చిన్న గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు.
బహిరంగ మార్కెట్లలో వేటి విలువ సుమారు 50,000 ఉండొచ్చని తెలిపారు. ఈ గంజాయి మొక్కలను తిరిగి ఒక్కొక్కటి 500 రూపాయల చొప్పున అమ్ముతుండేవారని పోలీసులు వివరించారు.
తెలంగాణలో గంజాయి రవాణా పై పోలీసులు ఉక్కు పాదం మోపుతుండడంతో ఇలా గంజాయి మొక్కలను రవాణా చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.
గంజాయిని సేవించేవారు ఈ గంజాయి మొక్కలను కొనుక్కొని ఇంటి ఆవరణంలో, పెరడులో, వ్యవసాయ పంట పొలాలలో నాటి అవి పూర్తిగా పెద్దవైన తర్వాత వాటిని సేవిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.
ఈ ఘటనలో ఇద్దరిపై కేసు నమోదు చేసిన పోలీసులు, వారిని రిమాండ్‌కు తరలిస్తున్నట్లు తెలిపారు.
ఈ సందర్బంగా సీఐ బన్సీలాల్ మాట్లాడుతూ..
పట్టణాల్లో గ్రామాల్లో ఎక్కడైనా గంజాయిని సేవించినా, విక్రయించినా, గంజాయి మొక్కలను పెంచిన, లేదా అక్రమంగా రవాణా చేసినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, అక్రమ కార్యకలాపాలపై పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. గంజాయి అక్రమ కార్యకలాపాల నియంత్రణకు పోలీసులు నిరంతర పెట్రోలింగ్ నిర్వహిస్తున్నట్లు ఈ సందర్భంగా సిఐ బన్సిలాల్ వెల్లడించారు.




