Mancherial: భూ పరిపాలన పెండింగ్ దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలి లోకేష్ కుమార్!

Mancherial: భూ పరిపాలన పెండింగ్ దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించాలని సీసీఎల్‌ఏ లోకేష్ కుమార్ ఆదేశం. మంచిర్యాల అదనపు కలెక్టర్ రాములు సమీక్షలో వెల్లడి.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 12 Oct 2026 5:11 PM IST
Mancherial
X

Mancherial: భూ పరిపాలన పెండింగ్ దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలి లోకేష్ కుమార్!

Mancherial: పరిపాలనకు సంబంధించిన పెండింగ్ దరఖాస్తుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలని భూ పరిపాలన ప్రధాన కమిషనర్ లోకేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి భూ సంబంధిత అంశాలపై సమీక్షించారు.

ప్రభుత్వ భూముల్లోని అర్హమైన ఖాళీ స్థలాలు, ఇళ్లు, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్, పట్టణ భూ గరిష్ఠ పరిమితి (యూఎల్‌సీ), భూముల క్రమబద్ధీకరణ, సింగరేణి బొగ్గు గనుల పరిధిలోని భూ సంబంధిత పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంపై చర్చించారు. జీఓ నంబర్‌ 59 మార్గదర్శకాల అమలుతో పాటు గ్రామాల రీ-సర్వే పురోగతిని సమీక్షించారు.

ప్రభుత్వ నిబంధనలు, సంబంధిత చట్టాలు, కోర్టు ఆదేశాలకు అనుగుణంగా దరఖాస్తులను పరిశీలించి, అర్హులైన వారికి నిబంధనల ప్రకారం పరిష్కారం చూపాలని లోకేష్ కుమార్ సూచించారు. గ్రామాల రీ-సర్వే కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, సిబ్బందికి తగిన శిక్షణ అందించాలని తెలిపారు. సర్వే విధానాలు, పరికరాల వినియోగంపై అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి. రాములు మాట్లాడుతూ భూ సంబంధిత పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం, భూముల రీ-సర్వే, జీఓ నంబర్‌ 59 అమలులో ప్రభుత్వ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమావేశంలో సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ శ్రీనివాస్, బి-సూపరింటెండెంట్ అతీష్, డి-సూపరింటెండెంట్ కవిత, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.