Bellampally: ఘనంగా కేసీఆర్ దీక్షా దివస్.. బైక్ ర్యాలీ నిర్వహణ!
Bellampally: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆధ్వర్యంలో కేసీఆర్ దీక్షా దివస్ వేడుకలు ఘనంగా జరిగాయి. భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.
Bellampally: ఘనంగా కేసీఆర్ దీక్షా దివస్.. బైక్ ర్యాలీ నిర్వహణ!
Bellampally: తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక మలుపు అయిన 'కేసీఆర్ దీక్షా దివస్' (నవంబర్ 29) సందర్భాన్ని పురస్కరించుకుని బెల్లంపల్లి పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు.
మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పట్టణంలోని తల్లి తెలంగాణ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం తెలంగాణ ఉద్యమ జ్ఞాపకాలను స్మరించుకుంటూ పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు, యువజన విభాగం కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




