Mancherial: భారత్ సమ్మిట్‌కు వ్యతిరేకంగా బీజేపీ యువమోర్చా నిరసన!

Mancherial: మంచిర్యాలలో బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. భారత్ సమ్మిట్ దేశ ప్రయోజనాలకు విరుద్ధమని, హామీలు అమలు చేయని రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 14 Nov 2026 3:21 PM IST
Mancherial
X

Mancherial: భారత్ సమ్మిట్‌కు వ్యతిరేకంగా బీజేపీ యువమోర్చా నిరసన!

Mancherial: కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న భారత్ సమ్మిట్ దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉందని బీజేపీ నాయకులు ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మంచిర్యాల పట్టణంలోని వెంకటేశ్వర టాకీస్ చౌరస్తాలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు.

ఈ సందర్భంగా బీజేపీ యువమోర్చా జిల్లా అధ్యక్షుడు శివకృష్ణ మాట్లాడుతూ.. దేశ సమగ్రత, సార్వభౌమత్వం, జాతీయ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉండే విధానాలను బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించదని స్పష్టం చేశారు. దేశ ప్రయోజనాలే పరమావధిగా ప్రభుత్వాలు పనిచేయాలని, ప్రజల మనోభావాలను గౌరవించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఎన్నికల సమయంలో ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలకు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, మూడేళ్లు గడుస్తున్నా వాటిని పూర్తిస్థాయిలో అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు. హామీల అమలుపై సమాధానం చెప్పకుండా రాహుల్ గాంధీ రాష్ట్రానికి రావడంపై ప్రశ్నలు లేవనెత్తారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చనందుకు రాహుల్ గాంధీ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో రెడ్డిమల్ల అశోక్, రామగిరి రాము, మామిడాల సాగర్, ఎర్ర రవితేజ, ఈశ్వర్, ప్రభంజన్, జక్కుల మహేష్, సాయి, మోటపలుకుల సతీష్, సాయి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.