Bellampally: బెల్లంపల్లిలో ఘనంగా ప్రధాని మోదీ 76వ జన్మదిన వేడుకలు!
Bellampally: బెల్లంపల్లి శిశుమందిర్‌లో ప్రధాని మోదీ 76వ జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసి విద్యార్థులకు పండ్లు పంపిణీ చేసిన బీజేపీ రాష్ట్ర నేత కొయ్యల ఏమాజి.
Bellampally: బెల్లంపల్లిలో ఘనంగా ప్రధాని మోదీ 76వ జన్మదిన వేడుకలు!
బెల్లంపల్లి: విశ్వ విఖ్యాత, ప్రపంచ నాయకుడు, భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ 76 వ జన్మదినోత్సవ వేడుకలు ఈ రోజు బెల్లంపల్లిలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జడ్పీటీసీ ల సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కొయ్యల ఏమాజి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక శిశుమందిర్ పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు , సిబ్బంది, బిజెపి నాయకులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారని ఏమాజి తెలిపారు.
విద్యార్థులకు కొయ్యల ఏమాజి పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కొయ్యల ఏమాజి మాట్లాడుతూ నరేంద్ర మోడీ లాంటి నాయకుడు ఈ దేశానికి ప్రధానమంత్రి కావడం దేశ ప్రజల అదృష్ట అన్నారు. ఆయన నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని అన్నారు. మోడీ వల్లనే ప్రపంచంలో దేశ ప్రతిష్ట పెరిగిందని తెలిపారు.
ఇలాంటి దూర దృష్టి ఉన్న నాయకుడు ప్రపంచంలోనే లేడని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్ మిస్ట్రెస్ భాగ్యలక్ష్మి, బిజెపి సీనియర్ నాయకులు గోవర్ధన్, ఆకుల శంకర్, యుగంధర్, శ్రావణ్ కుమార్, నవీన్ కుమార్, నర్సింగ్, శ్రీనివాస్, గణేష్, మోహన్, రమేష్, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.




