Bellampally: ఇంద్రవెళ్లి పాంచజన్య సభను జయప్రదం చేయాలి: బోడ జనార్దన్!

Bellampally: ఈ నెల 30న నిర్వహించే ఇంద్రవెళ్లి పాంచజన్య బహిరంగ సభను విజయవంతం చేయాలని బెల్లంపల్లిలో మాజీ మంత్రి బోడ జనార్దన్ పిలుపునిచ్చారు. సభ పోస్టర్‌ను విడుదల చేశారు.

PRATHAP, BELLAMPALLI
Published on: 28 Oct 2026 6:43 PM IST
Bellampally
X

Bellampally: ఇంద్రవెళ్లి పాంచజన్య సభను జయప్రదం చేయాలి: బోడ జనార్దన్!

బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో మాజీ ఎమ్మెల్యే బోడ జనార్దన్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. అనంతరం పాంచజన్య సభ పోస్టర్ విడుదల చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 30న ఇంద్ర వెళ్లి పాంచజన్య బహిరంగ సభను విజయవంతం చేయాలని టిఆర్ఎస్ నాయకులకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

గత బిఆర్ ఎస్ ప్రభుత్వం,ప్రస్తుత అధికార కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మూడు సంవత్సరాలు గడుస్తున్న ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ప్రజలను మోసం చేశాయని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించడానికి ఈ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సభకు ముఖ్య అతిథిగా టిఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రానున్నారని, అధిక సంఖ్యలో పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా అధికార ప్రతినిధి సిద్ధం శెట్టి సాజన్ బెల్లంపల్లి ఇంచార్జ్ బండారి శ్రీనివాస్ గౌడ్ మంచిర్యాల నియోజకవర్గ ఇంచార్జి మహేందర్ రెడ్డి పట్టణ అధ్యక్షులు శేషికాంత్ కార్యకర్తలు స్వరాజ్ మహంతి కార్తీక్ శ్రీనాథ్ రేవంత్ శ్రావణ్ సల్ల సాయి ప్రేమ్ ఇందూరి సాయి ఖాదర్ పాల్గొన్నారు.

PRATHAP, BELLAMPALLI

PRATHAP, BELLAMPALLI