Mancherial: విజయదశమి అందరికీ విజయాలను అందించాలి
Mancherial: బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శమీ పూజ నిర్వహించిన ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి. నియోజకవర్గ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు.
Mancherial: విజయదశమి అందరికీ విజయాలను అందించాలి
మంచిర్యాల జిల్లా: విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని బెల్లంపల్లి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి జమ్మి చెట్టుకు శమీ పూజ నిర్వహించారు. సంప్రదాయబద్ధంగా జరిగిన ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి మాట్లాడుతూ.. చెడుపై మంచి సాధించిన విజయానికి విజయదశమి ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. ఈ పర్వదినం ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, శాంతి, సౌభాగ్యాలను నింపాలని, ప్రజలు చేపట్టే ప్రతి కార్యంలో విజయాలు సాధించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి మున్సిపల్ చైర్మన్ దావస్వాతి రమేష్ బాబు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




