Asifabad: బెజ్జూరు ఎస్సీ కాలనీలో పోలీసుల కార్డెన్ అండ్ సెర్చ్!

Asifabad: బెజ్జూరు ఎస్సీ కాలనీలో పోలీసుల కార్డెన్ అండ్ సెర్చ్ సరైన ధ్రువపత్రాలు లేని 30 బైకులు సీజ్ ఎస్సై విజయ్ కుమార్ ఆధ్వర్యంలో తనిఖీలు, నాటుసారాపై అవగాహన.

SRINIVAS, KOUTALA
Published on: 29 Sept 2026 9:26 PM IST
Asifabad
X

Asifabad: బెజ్జూరు ఎస్సీ కాలనీలో పోలీసుల కార్డెన్ అండ్ సెర్చ్!

ఆసిఫాబాద్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో ఎస్సై విజయ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీలోని ప్రతి ఇంటిని వీధులను పోలీసులు తనిఖీ చేశారు. సరైన ధ్రువపత్రాలు లేని 30 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై విజయ్ కుమార్ తెలిపారు.

పత్రాలు చూపించిన తర్వాత వాహనాలను అప్పగిస్తామని ఆయన పేర్కొన్నారు. అనంతరం కాలనీవాసులతో ఎస్సై సమావేశమై గుడుంబా వినియోగం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. గుడుంబా తయారీ, విక్రయాలు, వినియోగానికి దూరంగా ఉండాలని సూచించారు.

ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఇలాంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని ఎస్సై తెలిపారు.

SRINIVAS, KOUTALA

SRINIVAS, KOUTALA