Bejjur: 18 రోజులుగా కార్యదర్శి లేక వెలవెలబోతున్న బెజ్జూర్ పంచాయతీ

Bejjur: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మేజర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి 18 రోజులుగా సెలవులో ఉండటంతో పనులు నిలిచిపోయాయని సర్పంచ్ సరోజ ఆవేదన.

SRINIVAS, KOUTALA
Published on: 25 Nov 2026 4:47 PM IST
Bejjur
X

Bejjur: 18 రోజులుగా కార్యదర్శి లేక వెలవెలబోతున్న బెజ్జూర్ పంచాయతీ

బెజ్జూర్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయం కార్యదర్శి లేక వెలవెలబోతోంది. కార్యదర్శి మెడికల్ లీవ్ కారణంగా 18 రోజులుగా విధులకు హాజరు కావడం లేదు. దీంతో పంచాయతీ పనులు నిలిచిపోయి గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

కనీసం ఇంచార్జి కార్యదర్శి కూడా లేకపోవడంతో పంచాయతీ పనులన్నీ నిలిచిపోయాయి. పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు, అభివృద్ధి పనుల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని సర్పంచ్ సరోజ తెలిపారు.

ధ్రువీకరణ పత్రాల కోసం, ఇతర పంచాయతీ పనుల కోసం కార్యాలయానికి వచ్చే ప్రజలు కార్యదర్శి లేక నిరాశతో తిరిగి వెళ్తున్నారు.

గ్రామంలో పారిశుద్ధ్యం, అభివృద్ధి పనులు స్తంభించిపోయాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే మరో కార్యదర్శిని నియమించాలని సర్పంచ్ సరోజ, గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు. లేకుంటే పనులన్నీ మరింత ఆలస్యమై గ్రామానికి నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

SRINIVAS, KOUTALA

SRINIVAS, KOUTALA