Asifabad: ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ జీవిత బీమా వర్తింపు: జగ్గా గౌడ్!

Asifabad: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలంలోని ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని వర్తింపజేస్తున్నట్లు కాంగ్రెస్ ఉపాధ్యక్షులు జగ్గా గౌడ్ తెలిపారు.

SRINIVAS, KOUTALA
Published on: 24 Nov 2026 2:29 PM IST
Asifabad
X

Asifabad: ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ జీవిత బీమా వర్తింపు: జగ్గా గౌడ్!

ఆసిఫాబాద్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలంలోని ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా పథకాన్ని వర్తింపచేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు జగ్గా గౌడ్ అన్నారు. బెజ్జూర్ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద జరుగుతున్న బీమా నమోదు కార్యక్రమాన్ని నాయకులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు.

కుటుంబ పెద్దకు ఏదైనా జరిగితే ఆ కుటుంబం ఆర్థికంగా కుంగిపోకుండా ఈ బీమా పథకం అండగా ఉంటుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ పథకంలో పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. నమోదు విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా నాయకులను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు నాహీర్ అలీ, కొట్రంగి రామకృష్ణ, పెద్దల శంకర్, తెలంగాణ జావిద్, శ్యామల కిరణ్ కుమార్, చిలుముల ప్రభాకర్, తునికి శంకర్, వార్డు సభ్యులు రామడుగుల రమేష్ తదితరులు పాల్గొన్నారు.

SRINIVAS, KOUTALA

SRINIVAS, KOUTALA