Asifabad: అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు: హమారా ప్రసాద్ దిష్టిబొమ్మ దహనం

Asifabad: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌పై వివాదాస్పద పుస్తకం రాసిన హమారా ప్రసాద్‌పై అట్రాసిటీ కేసు పెట్టి అరెస్ట్ చేయాలని కౌటాలలో బహుజన సంఘాలు నిరసన చేపట్టాయి.

SRINIVAS, KOUTALA
Published on: 18 Sept 2026 2:54 PM IST
Asifabad
X

Asifabad: అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు: హమారా ప్రసాద్ దిష్టిబొమ్మ దహనం

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా: కౌటాల మండల కేంద్రంలో బహుజన సంఘాల నాయకులు నిరసన చేపట్టారు. కౌటాల మండల కేంద్రంలో ప్రధానరహదారిపై హమారా ప్రసాద్ దిష్టిబొమ్మ దహనం చేశారు.

ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న కోట్లాది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అణగారిన వర్గాల ప్రజల ఆరాధ్య దైవం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను కించపరిచే విధంగా కల్పిత కథనాలతో పుస్తకాన్ని రచించి, బహిరంగంగా ఆవిష్కరిస్తామని ప్రకటించిన హమారా ప్రసాద్ అనే వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకుని వెంటనే అరెస్ట్ చేయాలని సిర్పూర్ తాలూకాలోని బహుజన సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.

ఇలాంటి నిరాధార ప్రచారాల వల్ల సమాజంలో కులమతాల మధ్య అపోహలు ఉద్రిక్తతలు ఏర్పడే ప్రమాదం ఉందని, గతంలో కూడా ఇలాంటి వివాదాస్పద ప్రచారాలు జరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు.

భారత రాజ్యాంగ నిర్మాత గౌరవాన్ని కాపాడటంతో పాటు సామాజిక సామరస్యాన్ని పరిరక్షించేందుకు ప్రభుత్వం మరియు పోలీసు యంత్రాంగం వెంటనే స్పందించి, సంబంధిత వ్యక్తిపై SC/ST అట్రాసిటీ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి, పుస్తక ఆవిష్కరణను నిలిపివేయాలని తహసిల్దార్ కు మెమొరాండం అందించి విజ్ఞప్తి చేశారు.

ఈ కారిక్రమంలో సిర్పూర్ నియోజక వర్గంలో ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాల నాయకులు బహుజన సంఘాల నాయకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

SRINIVAS, KOUTALA

SRINIVAS, KOUTALA