Chintalamanepally: 101 గంటల అఖండ భజనతో మార్మోగిన బాబాసాగర్
Chintalamanepally: ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం బాబాసాగర్‌లో శ్రీ సత్యసాయి బాబా జన్మదినం సందర్భంగా నిర్వహించిన 101 గంటల అఖండ సంకీర్తన ముగిసింది.
Chintalamanepally: 101 గంటల అఖండ భజనతో మార్మోగిన బాబాసాగర్
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా: చింతలమానేపల్లి మండలం బాబాసాగర్ గ్రామ హనుమాన్ ఆలయ ప్రాంగణంలో భక్తి పారవశ్యం వెల్లివిరిసింది. శ్రీ సత్యసాయి బాబా 101వ జన్మదినాన్ని పురస్కరించుకుని 101 గంటల అఖండ నామ సంకీర్తన కార్యక్రమాన్ని సత్యసాయి కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ నెల 22వ తేదీ నుంచి 26వ తేదీ నేటి వరకు ఐదు రోజుల పాటు భక్తి శ్రద్ధలతో ఈ అఖండ భజన కార్యక్రమం కొనసాగింది.
జిల్లా నలుమూలల నుండి శ్రీ సత్యసాయి భక్తులు మహిళలు భారీగా తరలివచ్చి భజనలో పాల్గొన్నారు. గత ఐదు రోజులుగా బాబాసాగర్ గ్రామ ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణం భజన కీర్తనలతో మార్మోగింది. భక్తులు అఖండ నామ స్మరణ చేస్తూ స్వామి వారి కీర్తనలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పారు.
గ్రామంలో ప్రతి సంవత్సరం సత్యసాయి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు భక్తులు తెలిపారు. కార్యక్రమం విజయవంతం కావడానికి గ్రామస్తులు, సత్యసాయి సేవా సమితి సభ్యులు కృషి చేశారు.




