Asifabad: అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులు

Asifabad: శబరిమల యాత్రకు వెళ్లే అయ్యప్ప స్వాముల సౌకర్యార్థం టీజీఎస్‌ఆర్టీసీ ఆధ్వర్యంలో ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆసిఫాబాద్ డీఎం రాజశేఖర్ తెలిపారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 14 Nov 2026 5:24 PM IST
Asifabad
X

Asifabad: అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులు

ఆసిఫాబాద్: శబరిమల యాత్రకు వెళ్లే అయ్యప్ప స్వాములు, భక్తుల సౌకర్యార్థం టీజీఎస్‌ఆర్టీసీ ఆధ్వర్యంలో ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు ఆసిఫాబాద్ డిపో మేనేజర్ కె.వి. రాజశేఖర్ తెలిపారు.

ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. అయ్యప్ప స్వాములు తమ ప్రయాణాన్ని సురక్షితంగా, సౌకర్యవంతంగా కొనసాగించేందుకు ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.

ప్రత్యేక బస్సు బుక్ చేసుకున్న భక్తులకు సంస్థ నిబంధనల ప్రకారం ఒక గురుస్వామి, ఇద్దరు మణికంఠులు, ఇద్దరు వంట మనుషులు, ఒక లగేజీ అటెండెంట్‌కు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనున్నట్లు వెల్లడించారు. అయ్యప్ప స్వాములు, భక్తులు, బృందాలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

బస్సుల బుకింగ్, ఇతర వివరాల కోసం 9493282510, 8328021517, 9959226006 నంబర్లలో సంప్రదించాలని డిపో మేనేజర్ సూచించారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.