Asifabad: ఈస్గాం పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ
Asifabad: ఈస్గాం పిఎస్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆసిఫాబాద్ ఎస్పీ నితికా పంత్. గంజాయి, మట్కా, అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలకు సిబ్బందికి ఆదేశం.
Asifabad: ఈస్గాం పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ
ఆసిఫాబాద్: కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ శ్రీమతి నితికా పంత్, ఐపీఎస్ ఈస్గాం పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి, స్టేషన్ రికార్డులు, కేసుల దర్యాప్తు పురోగతి, స్టేషన్ నిర్వహణ, సిబ్బంది విధుల నిర్వహణను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ, వారి సమస్యలను ఓపికగా విని, చట్టపరిధిలో సత్వర న్యాయం అందించేందుకు కృషి చేయాలని సిబ్బందికి సూచించారు.
స్టేషన్ లోని క్రైమ్ రికార్డులు,కేసు డైరీలు, ఎఫ్ఐఆర్లు, పెండింగ్ కేసులు, వారెంట్లు, బీట్ వ్యవస్థ, రౌడీ షీట్లు, సిసిటిఎన్ఎస్,తదితర రికార్డులను పరిశీలించి కేసుల దర్యాప్తును నాణ్యతతో,నిర్ణీత గడువులో పూర్తి చేయాలి, పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని ఆదేశించారు.
గ్రామస్థాయిలో పోలీస్–ప్రజల మధ్య సత్సంబంధాలను బలోపేతం చేస్తూ, శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు.
అక్రమ గంజాయి రవాణా, విక్రయాలు, ఇతర నిషేధిత పదార్థాల అక్రమ రవాణా, జూదం, సట్కా మట్కా వంటి అసాంఘిక కార్యకలాపాలపై నిరంతరం నిఘా ఉంచి, వాటికి పాల్పడే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
పోలీస్ స్టేషన్ పరిసరాలు, రికార్డు గదులు, సిబ్బంది వసతి ప్రాంతాలను పరిశుభ్రంగా, క్రమబద్ధంగా ఉంచాలని సూచించారు. విధి నిర్వహణలో క్రమశిక్షణ, అప్రమత్తత, బాధ్యతాయుతమైన ప్రజాసేవా దృక్పథంతో పనిచేయాలని సిబ్బందికి దిశానిర్దేశం చేశారు.
పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ, ప్రజలకు మరింత మెరుగైన పోలీస్ సేవలు అందించాలని జిల్లా ఎస్పీ నితిక పంత్, ఐపీఎస్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కాగజ్నగర్ రూరల్ సీఐ కుమారస్వామి, ఎస్సై నరేష్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.




