Komaram bheem: విద్యార్థినులకు భద్రతపై షీ టీమ్ అవగాహన

Komaram bheem: కొమరం భీం జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ జూనియర్ కళాశాలలో గుడ్ టచ్–బ్యాడ్ టచ్, సైబర్ భద్రతపై ఆసిఫాబాద్ షీ టీమ్ అవగాహన కల్పించింది.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 19 Nov 2026 5:40 PM IST
Komaram bheem
X

Komaram bheem: విద్యార్థినులకు భద్రతపై షీ టీమ్ అవగాహన

కొమరం భీం జిల్లా విద్యార్థినులు తమ భద్రతపై అవగాహన కలిగి ఉండటంతో పాటు, ఎలాంటి వేధింపులు ఎదురైనా ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని ఆసిఫాబాద్ షీ టీమ్ సూచించింది. మహిళలు, బాలల భద్రత, గుడ్ టచ్–బ్యాడ్ టచ్, సోషల్ మీడియా వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ జూనియర్ కళాశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

జిల్లా ఎస్పీ నితికా పంత్, ఐపీఎస్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో షీ టీమ్ సభ్యులు విద్యార్థినులకు పలు కీలక అంశాలపై అవగాహన కల్పించారు. గుడ్ టచ్–బ్యాడ్ టచ్‌ను గుర్తించడం, అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండటం, మహిళలు మరియు బాలల భద్రతకు సంబంధించిన అంశాలను వివరించారు.

సోషల్ మీడియాను అతిగా వినియోగించడం వల్ల మానసిక ఒత్తిడి పెరగడంతో పాటు చదువుపై ఏకాగ్రత తగ్గే అవకాశం ఉందని తెలిపారు. ఆన్‌లైన్‌లో పరిచయమైన అపరిచితులతో వ్యక్తిగత సమాచారం, ఫొటోలు, వీడియోలు పంచుకోవద్దని సూచించారు. సోషల్ మీడియా వేదికగా ఎవరైనా వేధింపులకు పాల్పడినా, అనుమానాస్పద పరిస్థితులు ఎదురైనా భయపడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా పోలీసుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు.

మహిళలు, బాలలు ఏ సమస్య ఎదురైనా మౌనంగా ఉండకుండా షీ టీమ్‌ను సంప్రదించాలని సూచించారు. తక్షణ సహాయం లేదా ఫిర్యాదు కోసం ఆసిఫాబాద్ షీ టీమ్ 8712670564 నంబర్‌కు ఫోన్ కాల్ లేదా వాట్సాప్ ద్వారా సమాచారం అందించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ అరుణ, షీ టీమ్ సిబ్బంది రజని, స్వప్న తదితరులు పాల్గొన్నారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.