Asifabad: దాహెగాం పీహెచ్‌సీలో వైద్య సిబ్బంది లేక గర్భిణికి ప్రసవం చేసిన ఆయా!

Asifabad: కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా దాహెగాం పీహెచ్‌సీలో వైద్య సిబ్బంది లేక గర్భిణికి ప్రసవం చేసిన మాజీ ఆయా. తల్లీబిడ్డ క్షేమం.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 10 Nov 2026 1:51 PM IST
Asifabad
X

Asifabad: దాహెగాం పీహెచ్‌సీలో వైద్య సిబ్బంది లేక గర్భిణికి ప్రసవం చేసిన ఆయా!

Asifabad: కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో పురిటి నొప్పులతో వచ్చిన ఓ గర్భిణి ఇబ్బందులు ఎదుర్కొంది. చివరకు ఆసుపత్రిలో గతంలో ఆయాగా పనిచేసిన మహిళ తనకున్న పరిజ్ఞానంతో ప్రసవం చేయడంతో తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు.

వివరాల్లోకి వెళ్తే సోమవారం జానగిరి తులసి అనే గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు ఆటోలో దాహెగాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకొచ్చారు. ఆ సమయంలో 108 అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో బెజ్జూరు నుంచి అంబులెన్స్ రావడానికి సమయం పట్టింది.

మరోవైపు ఉదయం 7:30 నుంచి 8:30 గంటల వరకు ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బంది ఎవరూ అందుబాటులో లేరని కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో తులసికి పురిటి నొప్పులు తీవ్రం కావడంతో ఆసుపత్రిలో గతంలో ఆయాగా పనిచేసి ప్రస్తుతం రోజువారీ ఆయాగా కొనసాగుతున్న మహిళను కుటుంబ సభ్యులు పిలిపించారు. ఆమె తనకున్న పరిజ్ఞానంతో సాధారణ ప్రసవం చేయగా తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

ప్రభుత్వ ఆసుపత్రిలో కీలక సమయంలో వైద్య సిబ్బంది అందుబాటులో లేకపోవడం, 108 అంబులెన్స్ సేవలు తక్షణమే లభించకపోవడంపై స్థానికంగా చర్చ జరుగుతోంది. అత్యవసర సమయంలో వైద్య సేవలు అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.