Asifabad: ప్రిన్సిపల్ నియామకంపై మెడికల్ విద్యార్థుల ఆందోళన
Asifabad: కొమురం భీమ్ ఆసిఫాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజ్‌లో ఇన్‌చార్జ్ ప్రిన్సిపల్ నియామకాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు తరగతులు బహిష్కరించి బైఠాయించారు.
Asifabad: ప్రిన్సిపల్ నియామకంపై మెడికల్ విద్యార్థుల ఆందోళన
కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా: ప్రభుత్వ మెడికల్ కాలేజ్‌లో ఇన్‌చార్జ్ ప్రిన్సిపల్‌గా డాక్టర్ శ్రీలక్ష్మిని నియమించడాన్ని వ్యతిరేకిస్తూ వైద్య విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఈ మేరకు విద్యార్థులు తరగతులను బహిష్కరించి కళాశాల ఎదుట బైఠాయించి ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు.
గతంలో ప్రిన్సిపల్‌గా బాధ్యతలు నిర్వహించిన డాక్టర్ లకావత్ వెంకట్‌ను తిరిగి అదే స్థానంలో నియమించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఆయనను రిమ్స్ ఆదిలాబాద్ సూపరింటెండెంట్‌గా బదిలీ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. పాత ప్రిన్సిపల్‌ను తిరిగి నియమించే వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా, నిరసనలో పాల్గొన్న విద్యార్థులు ముఖాలకు మాస్కులు ధరించడం చర్చనీయాంశంగా మారింది. తమను గుర్తిస్తే ఇన్‌చార్జ్ ప్రిన్సిపల్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడే అవకాశం ఉందని భయపడుతున్నట్లు విద్యార్థులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తమ నిరసనను మాస్కులు ధరించి కొనసాగించారు.
విద్యార్థుల ఆందోళనతో ప్రభుత్వ మెడికల్ కాలేజ్‌లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. విద్యార్థుల డిమాండ్లపై ఉన్నతాధికారులు ఏ విధంగా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.




