Koutala: పెరటి కోళ్లు, వర్మీ కంపోస్ట్‌తో అదనపు ఆదాయం: కలెక్టర్!

Koutala: కౌటాలలో విజయవాహిని ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైతులతో కలెక్టర్ కె. హరిత ముఖాముఖి. పెరటి కోళ్ల పెంపకం, వర్మీ కంపోస్ట్‌తో రైతులు అదనపు ఆదాయం పొందాలని పిలుపునిచ్చారు.

SRINIVAS, KOUTALA
Published on: 14 Oct 2026 8:10 PM IST
Koutala
X

Koutala: పెరటి కోళ్లు, వర్మీ కంపోస్ట్‌తో అదనపు ఆదాయం: కలెక్టర్!

కౌటాల: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలో విజయవాహిని చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అమలవుతున్న కాలానుకూల వ్యవసాయ ఆధారిత జీవనోపాధుల కార్యక్రమం లో భాగంగా జిల్లా కలెక్టర్ కె హరిత రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పెరటి కోళ్ల పెంపకంపై శిక్షణ పొందిన రైతులతో, వర్మీ కంపోస్ట్ తయారీలో విజయవంతంగా ముందుకు సాగుతున్న రైతులతో మాట్లాడి వారి అనుభవాలు, ప్రయోజనాలు, ఎదుర్కొంటున్న సవాళ్లను తెలుసుకున్నారు.

రైతులు ప్రత్యామ్నాయ జీవనోపాధి మార్గాలను అవలంబించి, అదనపు ఆదాయం పొందేలా ప్రోత్సహించాలన్నారు అందుబాటులో ఉన్న ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

రైతుల జీవన ప్రమాణాల మెరుగుదల, స్థిరమైన వ్యవసాయం, గ్రామీణ జీవనోపాధుల బలోపేతానికి దోహదపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నీతి ఆయోగ్ జిల్లా సమన్వయ కర్త డా బాలరాజు రాజారాం, ప్రోగ్రామ్ ఆఫీసర్ ప్రతాప్, కౌశిక్, అడ్మిన్ వినయ్, ఎస్ టు పోషన్ ప్రోగ్రామ్ ఆఫీసర్ సాయి లిఖిత, రైతులు తదితరులు సిబ్బంది పాల్గొన్నారు.

SRINIVAS, KOUTALA

SRINIVAS, KOUTALA