Asifabad: ఆసిఫాబాద్ పోలీస్ ఆఫీసులో బతుకమ్మ సంబరాలు

Asifabad: కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ నితికా పంత్, కలెక్టర్ హరిత ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 13 Oct 2026 9:15 PM IST
Asifabad
X

Asifabad: ఆసిఫాబాద్ పోలీస్ ఆఫీసులో బతుకమ్మ సంబరాలు

కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ నితికా పంత్, ఐపీఎస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ హరిత, జిల్లా ప్రధాన న్యాయమూర్తి శారదాదేవి, జేఎఫ్‌సీఎం అనంతలక్ష్మి, డీఎఫ్‌వో బాలామణి, మహిళా పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎస్పీ నితికా పంత్ మాట్లాడుతూ పువ్వులను పూజించడం, ప్రకృతిని ఆరాధించడం తెలంగాణ ప్రజల గొప్ప సంస్కృతి, సంప్రదాయమని అన్నారు. బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడబిడ్డల జీవన సంస్కృతి, ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. మహిళల ఆత్మీయత, ఐక్యత, ప్రకృతి ప్రేమను చాటిచెప్పే ఈ పండుగ ద్వారా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించాలని పిలుపునిచ్చారు.

పోలీస్ కార్యాలయ ప్రాంగణంలో రంగురంగుల పూలతో అందంగా అలంకరించిన బతుకమ్మలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మహిళా పోలీసు అధికారులు, సిబ్బంది సంప్రదాయ దుస్తులు ధరించి బతుకమ్మ పాటలు పాడుతూ ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. పండుగ వాతావరణంలో సాగిన ఈ సంబరాలు అందరినీ ఆకట్టుకున్నాయి.

ఈ వేడుకలతో పోలీసు కుటుంబాల్లో పండుగ సందడి నెలకొంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల పట్ల గౌరవం, ఐక్యతాభావం మరింత బలపడేలా కార్యక్రమం నిర్వహించారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.