Asifabad: ఆడేపల్లిలో జ్వరాల కలకలం: పడిపోతున్న ప్లేట్‌లెట్స్
Asifabad: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం ఆడేపల్లిలో జ్వరాల తీవ్రతతో ప్లేట్‌లెట్స్ తగ్గుతుండటంతో వైద్యాధికారులు అత్యవసర హెల్త్ క్యాంప్ నిర్వహించారు.
Asifabad: ఆడేపల్లిలో జ్వరాల కలకలం: పడిపోతున్న ప్లేట్‌లెట్స్
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా: చింతలమానేపల్లి మండలం ఆడేపల్లి గ్రామంలో జ్వరాలతో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. గ్రామంలో జ్వరాలు ఉన్నవారికి తెల్ల రక్త కణాలు ప్లేట్లెట్స్ తగ్గుతున్నట్లు సమాచారం అందడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.
దీంతో సంబంధిత వైద్యాధికారులు వెంటనే స్పందించారు లోన్ వెళ్ళి PHC సిబ్బందితో కలిసి గ్రామంలో హెల్త్ క్యాంప్ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. జ్వరాలకు సంబంధించిన వైద్య పరీక్షలు నిర్వహించారు.
డెంగ్యూ, మలేరియా లక్షణాలతో బాధపడుతున్న వారిని గుర్తించి మెరుగైన వైద్యం కోసం సర్పంచ్ సుగణ బీంరావ్, ఉపసర్పంచ్ మహేశ్ గౌడ్ ఆధ్వర్యంలో కాగజ్ నగర్ ఆసుపత్రికి తరలించారు. గ్రామంలో దోమల నివారణ చర్యలు చేపట్టాలని, ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.




