Asifabad: బెజ్జూర్ మండలంలో పాఠశాల వద్ద రోడ్డు ప్రమాదం తండ్రికి తీవ్ర గాయాలు!

Asifabad: ఆసిఫాబాద్ జిల్లా బోగడగూడ పాఠశాల వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. పిల్లలను స్కూల్‌కు తెస్తున్న రవీందర్‌ను బొలెరో వాహనం ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 29 Oct 2026 11:00 AM IST
Asifabad
X

Asifabad: బెజ్జూర్ మండలంలో పాఠశాల వద్ద రోడ్డు ప్రమాదం తండ్రికి తీవ్ర గాయాలు!

Asifabad: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం లంబాడిగూడ గ్రామ పంచాయతీ పరిధిలోని బోగడగూడ మేరీమాత ఇంగ్లీష్ మీడియం పాఠశాల వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

మార్తిడి గ్రామానికి చెందిన గోమాస్ రవీందర్ తన పిల్లలను స్కూటర్‌పై పాఠశాలకు తీసుకువస్తుండగా ప్రమాదం జరిగింది. సలుగుపల్లి వైపు నుంచి వేగంగా వస్తున్న బొలెరో వాహనం స్కూటర్‌ను ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో రవీందర్ కాలికి తీవ్ర గాయాలై, తీవ్ర రక్తస్రావం అయింది. వెంటనే స్థానికులు స్పందించి ఆర్‌ఎంపీ వైద్యుడి వద్ద ప్రథమ చికిత్స అందించారు. పిల్లలు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

ప్రమాదం అనంతరం బొలెరో డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించాడని బాధితుడు ఆరోపించాడు. తన తప్పు లేదంటూ వాహనంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడని తెలిపాడు.

పాఠశాల సమయంలో వాహనాలు వేగంగా నడపడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల వద్ద స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని, నిందితుడైన బొలెరో డ్రైవర్ పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్