Asifabad: చింతలమానేపల్లిలో వర్షాల కోసం కప్పతల్లి ఆటలు

Asifabad: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలంలో వర్షాలు లేక పంటలు ఎండిపోతుండటంతో రైతులు సంప్రదాయబద్ధంగా కప్పతల్లి ఆటలు ఆడి వర్షం కోసం మొక్కుకున్నారు.

SRINIVAS, KOUTALA
Published on: 11 Oct 2026 4:05 PM IST
Asifabad
X

Asifabad: చింతలమానేపల్లిలో వర్షాల కోసం కప్పతల్లి ఆటలు

Asifabad: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలంలోని బాబాసాగర్, ధరంపల్లి, ఎక్స్ రోడ్ తదితర గ్రామాల్లో వర్షాలు కురవాలని రైతులు కప్పతల్లి ఆటలు ఆడారు.

గత కొన్ని రోజులుగా వర్షాలు లేక పంటలు ఎండిపోతుండటం, భూముల్లో పగుళ్లు రావడంతో ఆందోళన చెందిన రైతులు తమ పూర్వీకుల నుంచి వస్తున్న ఆనవాయితీ ప్రకారం కప్పతల్లి ఆటను నిర్వహించారు.

గ్రామంలోని యువకులు, రైతులు ఒంటిపై తలపై బిందెలతో నీళ్ళు చల్లుకుంటూ విధుల్లో ఇంటింటికి తిరుగుతూ కప్పతల్లి కప్పతల్లి వర్షం కురిపించు తల్లి" అంటూ పాటలు పాడారు

గ్రామ మహిళలు వారిపై నీళ్లు చల్లుతూ వర్షం కురవాలని మొక్కుకున్నారు.

వర్షాలు కురిసి పంటలు పండాలని గ్రామాల్లో హనుమాన్ ఆలయాల్లో పోచమ్మ ఆలయాల్లో బిందెలతో నీళ్ళు పోస్తూ పంటలను కాపాడాలని దేవుళ్ళను వేడుకుంటున్నామని రైతులు తెలిపారు.

పూర్వకాలం నుండి వస్తున్న ఆచారం ప్రకారం కప్పతల్లి వేషం వేసి వర్షం కోసం ప్రార్థించారు.

SRINIVAS, KOUTALA

SRINIVAS, KOUTALA