Asifabad: తెలంగాణ రాష్ట్ర హ్యాండ్‌బాల్ రెఫెరీగా ఆసిఫాబాద్ యువకుడు సంజీవ్
Asifabad: రాష్ట్ర హ్యాండ్‌బాల్ రెఫెరీగా డబ్బా గ్రామానికి చెందిన దుర్గం సంజీవ్ ఎంపిక. ఆర్మూర్‌లో నిర్వహించిన క్లినిక్‌లో B గ్రేడ్‌తో అర్హత. ప్రశంసల వెల్లువ.
Asifabad: తెలంగాణ రాష్ట్ర హ్యాండ్‌బాల్ రెఫెరీగా ఆసిఫాబాద్ యువకుడు సంజీవ్
ఆసిఫాబాద్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమనేపల్లి మండలం డబ్బా గ్రామానికి చెందిన దుర్గం మొండయ్య ఇందిరా దంపతుల కుమారుడు దుర్గం సంజీవ్ తెలంగాణ రాష్ట్ర హ్యాండ్బాల్ న్యాయ నిర్ణేత్తగా ఎంపికయ్యారు..
ఈ నెల 13వ తేదీ నుండి 15 వరకు నిజామాబాదు జిల్లా అర్ముర్ లో తెలంగాణ రాష్ట్ర హ్యాండ్బాల్ ఆధ్వర్యంలో నిర్వహించిన రెఫెరీ క్లినిక్ లో రాష్ట్ర నుండి దాదాపు 100 మంది పాల్గొన్నారు.
ఇందులో మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి 9 మంది పాల్గొన్నారు. వాళ్లలో డబ్బా గ్రామవాసి సంజీవ్ కుడా పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబర్చి B గ్రేడ్ తో క్వాలిఫై అయ్యారు.
ఇకనుండి తెలంగాణ రాష్ట్ర ఆధ్వర్యంలో జరిగే ప్రతి టోర్నమెంట్ లో న్యాయ నిర్ణేత్తగా వ్యవహారిస్తారు. గ్రమ వ్యక్తి ఈ స్థాయి కి చేరుకోవడంతో గ్రామస్థులు మరియూ బంధువులు అభినందనలు తెలిపారు. రాష్ట్ర స్థాయి లోనే కాకుండా జాతీయ అంతర్జాతీయ స్థాయి వరకు ఎదగాలి అని ఆకాంక్షంచారు.




