Kouthala: కౌటాల ఎంపీడీఓ ఆఫీస్ ఎదుట దివ్యాంగ పారిశుద్ధ్య కార్మికుని ధర్నా
Kouthala: కౌటాల ఎంపీడీఓ ఆఫీస్ ఎదుట ముత్తంపేట్ దివ్యాంగ పారిశుద్ధ్య కార్మికుడు దుర్గం బండు కుటుంబం ధర్నా చేపట్టింది. విధుల్లోకి తీసుకోవాలని విజ్ఞప్తి.
Kouthala: కౌటాల ఎంపీడీఓ ఆఫీస్ ఎదుట దివ్యాంగ పారిశుద్ధ్య కార్మికుని ధర్నా
కౌటాల: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండల ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ఓ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుడి కుటుంబం కన్నీటి పర్యంతమైంది.
ముత్తంపేట్ గ్రామ పంచాయతీలో 7సంవత్సరాలుగా పారిశుద్ధ్య కార్మికుడుగా పనిచేస్తున్న దుర్గం బండు అనే మూగ చెవిటి కార్మికుడిని సర్పంచ్ భర్త అయిన మోతిరామ్ అనే వ్యక్తి అకారణంగా విధుల నుంచి తొలగించారని ఆరోపిస్తూ అతని కుటుంబ సభ్యులు ధర్నాకు దిగారు.
మాటలు రాని, వినికిడి లోపం ఉన్న తనను అన్యాయంగా తొలగించారని బండు సంజ్ఞల ద్వారా తెలిపాడు. తన భార్య అంధురాలు కాగా ముగ్గురు ఆడపిల్లలు, ఒక బాబు ఉన్నారని, పంచాయతీ కార్మికుడిగా వచ్చే జీతంతోనే కుటుంబాన్ని పోషిస్తున్నామని, ఇప్పుడు ఉద్యోగం పోవడంతో రోడ్డున పడ్డామని ఆవేదన వ్యక్తం చేశాడు.
మూగ, చెవిటి వాడైన తన భర్తను తిరిగి విధుల్లోకి తీసుకుని న్యాయం చేయాలని అంధురాలు అయిన భార్య, ముగ్గురు కూతుళ్లు, కొడుకుతో కలిసి ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టింది. అకారణంగా తొలగించిన తన భర్తను వీధుల్లో తీసుకుని, తమకు న్యాయం చేయాలని కోరారు.




