Asifabad: సిర్పూర్ (టీ) ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ హరిత!

Asifabad: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (టీ) ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ కె. హరిత. విధులకు గైర్హాజరైన వైద్యులపై ఆగ్రహం.

SRINIVAS, KOUTALA
Published on: 10 Oct 2026 10:30 AM IST
Asifabad
X

Asifabad: సిర్పూర్ (టీ) ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ హరిత!

Asifabad: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలోని వైద్యులు, సిబ్బంది విధుల పట్ల సమయపాలన పాటించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కె.హరిత అన్నారు.

జిల్లాలోని సిర్పూర్ టి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి రోగులు, డెలివరీ వార్డులు, మందుల నిల్వలు, రోగ నిర్ధారణ యంత్రం పనితీరు, రిజిస్టర్లు, పరిసరాలను పరిశీలించారు.

ఈ సందర్భంలో ఆసుపత్రిలో 5 మంది వైద్యులు విధులు నిర్వర్తించవలసి ఉండగా ఒక్కరు మాత్రమే విధులలో ఉండటానికి గమనించి, మిగతా వారు విధులకు రాకపోవడానికి గల కారణాలపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారికి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవలసిందిగా ఆదేశించారు.

ఆసుపత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని, ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

వైద్యులు, ఇబ్బంది విధుల పట్ల సమయపాలన పాటించాలని, మందుల కొరత లేకుండా అవసరమైన మందులను నిల్వ ఉంచుకోవాలని, వైద్య పరికరాలు వినియోగంలో ఉండేలా పర్యవేక్షించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

SRINIVAS, KOUTALA

SRINIVAS, KOUTALA