Bejjur: నాగులవాయిలో రోడ్డు భద్రతపై బెజ్జూర్ ఎస్ఐ అవగాహన!
Bejjur: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా నాగులవాయిలో బెజ్జూర్ ఎస్ఐ కే. రమేష్ రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు.
Bejjur: నాగులవాయిలో రోడ్డు భద్రతపై బెజ్జూర్ ఎస్ఐ అవగాహన!
బెజ్జూర్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలంలోని నాగులవాయి గ్రామంలో బెజ్జూర్ ఎస్ఐ కే. రమేష్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇటీవల రేచిని గ్రామానికి చెందిన ఉపసర్పంచ్ నికూరి అనంతరావు మరియు ఆయన చిన్నాన్న నికూరి రాజయ్య సలుగుపల్లి శివారులో రోడ్డు మూల మలుపు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఘటనను గుర్తుచేస్తూ, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ సూచించారు.
వాహనాలను అతివేగంగా నడపకుండా నెమ్మదిగా అప్రమత్తంగా నడపాలని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదు అని మోటార్ సైకిల్‌పై ఇద్దరు మాత్రమే ప్రయాణించాలి అని తెలిపారు. రోడ్డు మలుపుల వద్ద ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి సూచించారు.
మన ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా కాపాడుకోవాలని గ్రామ ప్రజలకు ఎస్ఐ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు యువకులు గ్రామస్థులు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




