Bejjur: పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. ఐదుగురు అరెస్ట్!

Bejjur: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్‌లో పేకాట స్థావరంపై పోలీసుల దాడి. ఐదుగురు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడగా నగదు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్న ఎస్‌ఐ రమేష్.

SRINIVAS, KOUTALA
Published on: 29 Oct 2026 7:31 PM IST
Bejjur
X

Bejjur: పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. ఐదుగురు అరెస్ట్!

బెజ్జూర్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ గ్రామంలో పేకాట స్థావరంపై పోలీసులు మెరుపు దాడి చేశారు. డబ్బులు పెట్టి పేకాట ఆడుతున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు బెజ్జూర్ ఎస్ఐ కె. రమేష్ తన సిబ్బందితో కలిసి దాడి నిర్వహించారు.

ఈ దాడిలో పేకాట ఆడుతున్న ఐదుగురు వ్యక్తులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. 1శివ ప్రసాద్2 శంకర్ 3 గంగయ్య4 తిరుపతి 5 ఓదెలు అనే వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 52 పేక ముక్కలు, నగదు రూ.2,500 మరియు రెండు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఘటనకు సంబంధించి సదరు వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు బెజ్జూర్ ఎస్ఐ కె. రమేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ప్రజలు ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు.

SRINIVAS, KOUTALA

SRINIVAS, KOUTALA