Bejjur: బెజ్జూర్‌లో గుడుంబా, మట్కా కేసుల్లో 17 మంది బైండోవర్!
Bejjur: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్‌లో గుడుంబా, మట్కా, కోడిపందాలకు పాల్పడిన 17 మందిని పోలీసులు తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేశారు.
Bejjur: బెజ్జూర్‌లో గుడుంబా, మట్కా కేసుల్లో 17 మంది బైండోవర్!
బెజ్జూర్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండల పరిధిలో గుడుంబా, మట్కా, కోడిపందాలకు పాల్పడిన 17 మంది వ్యక్తులను పోలీసులు బెజ్జూర్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్, తహసీల్దార్ ఎదుట హాజరుపరిచి బైండోవర్ చేశారు.
ఇకపై వారు గుడుంబా, మట్కా, కోడిపందాలు, ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడకుండా, ప్రజాశాంతికి భంగం కలిగించకుండా ఉండేలా ఈ చర్యలు చేపట్టినట్లు బెజ్జూర్ ఎస్ఐ రమేష్ తెలిపారు.
బెజ్జూర్ మండల పరిధిలో ఎవరైనా గుడుంబా తయారీ, విక్రయాలు, మట్కా, కోడిపందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమానాస్పద కార్యకలాపాలు, అక్రమ వ్యాపారాల సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. సమాచారం కోసం ఫోన్ నంబర్: 87126 70541 కు అందించాలని తెలిపారు.




