Asifabad: ఆసిఫాబాద్ ఆశ్రమ పాఠశాల బియ్యం కాజేసిన హెచ్‌ఎంపై ఐటీడీఏ చర్యలు
Asifabad: కొమురం భీం జిల్లా గోలేటి ఆశ్రమ పాఠశాల హెచ్‌ఎం బియ్యం పక్కదారి పట్టించడంతో ఐటీడీఏ పీఓ సస్పెండ్ చేశారు. హెచ్‌ఎమ్‌టీవీ వార్తపై అధికారులు స్పందించారు.
Asifabad: ఆసిఫాబాద్ ఆశ్రమ పాఠశాల బియ్యం కాజేసిన హెచ్‌ఎంపై ఐటీడీఏ చర్యలు
Asifabad: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం గోలేటి ఆశ్రమ పాఠశాల బాలుర వసతి గృహ ప్రధానోపాధ్యాయుడు పవార్ రవీందర్‌పై సస్పెన్షన్ వేటు పడింది. స్థానికులు చేసిన ఆరోపణల నేపథ్యంలో నిర్వహించిన పరిశీలనలో బియ్యం పక్కదారి పట్టించినట్లు నిర్ధారణ కావడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు ఐటీడీఏ పీఓ మంద మకరంద్ వెల్లడించారు.
ఈ వ్యవహారంపై తదుపరి విచారణ కొనసాగుతోందని, విచారణ పూర్తయ్యే వరకు వేచి చూడకుండా నిబంధనల ప్రకారం ప్రధానోపాధ్యాయుడిని సస్పెండ్ చేసినట్లు తెలిపారు. విద్యార్థుల సంక్షేమం, ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల నిర్వహణ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని ఐటీడీఏ పీఓ స్పష్టం చేశారు.




