Bejjur: మర్తిడి గ్రామంలో డ్రగ్స్, గంజాయి సాగుపై అవగాహన సదస్సు: ఎస్ఐ
Bejjur: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా మర్తిడి గ్రామంలో బెజ్జూర్ ఎస్ఐ కే.రమేష్ ఆధ్వర్యంలో డ్రగ్స్, గంజాయి సాగు మరియు వినియోగంపై అవగాహన సదస్సు నిర్వహించారు.
Bejjur: మర్తిడి గ్రామంలో డ్రగ్స్, గంజాయి సాగుపై అవగాహన సదస్సు: ఎస్ఐ
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా: బెజ్జూర్ మండల పరిధిలోని మర్తిడి గ్రామంలో బెజ్జూర్ ఎస్ఐ కే.రమేష్ ఆధ్వర్యంలో డ్రగ్స్, గంజాయి సాగు, వినియోగం వల్ల కలిగే అనర్థాలపై* అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్ఐ రమేష్ మాట్లాడుతూ.. గంజాయి సాగు చేయడం, విక్రయించడం, రవాణా చేయడం, వినియోగించడం చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు. మత్తు పదార్థాల వినియోగం వల్ల ఆరోగ్యం, కుటుంబం, భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడుతుందని వివరించారు.
ముఖ్యంగా యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ, చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా తమ భవిష్యత్తుపై దృష్టి సారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బెజ్జూర్ ఎస్ఐ కే.రమేష్ తో పాటు హెడ్ కానిస్టేబుల్ ఎస్.సమ్మయ్య, మహిళా పోలీస్ కానిస్టేబుల్ బి.కాంత పాల్గొన్నారు.
గ్రామ పరిధిలో ఎవరైనా గంజాయి సాగు చేసినా, విక్రయించినా, రవాణా చేసినా లేదా ఇతర మత్తు పదార్థాలకు సంబంధించిన అక్రమ కార్యకలాపాలకు పాల్పడినా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు.
గ్రామ ప్రజలు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, గంజాయి సాగు, వినియోగం లేదా విక్రయాలకు సంబంధించిన సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేసి, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి సహకరించాలని కోరారు.




