Asifabad: బడిలోనే హెచ్‌ఎం మద్యం సేవనం.. కలకలం రేపిన విద్యార్థుల ఆరోపణలు!

Asifabad: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం గంభీరావుపేట పాఠశాల హెచ్‌ఎం బడిలోనే మద్యం తాగుతున్నారని విద్యార్థులు, గ్రామస్థులు ఎంఈవోకు ఫిర్యాదు చేశారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 3 Nov 2026 4:15 PM IST
Asifabad
X

Asifabad: బడిలోనే హెచ్‌ఎం మద్యం సేవనం.. కలకలం రేపిన విద్యార్థుల ఆరోపణలు!

Asifabad: బడిలో విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ప్రధానోపాధ్యాయుడిపై మద్యం సేవించి విధులకు హాజరవుతున్నారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం గంభీరావుపేటలోని ఎంపీయూపీఎస్ పాఠశాల హెచ్ఎం శ్రీనివాస్ మూడు రోజులుగా మద్యం సేవించి పాఠశాలకు వస్తున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.

అంతేకాకుండా పాఠశాలలోని బాత్రూం వద్దకు వెళ్లి మద్యం సేవించి, మిగిలిన మద్యాన్ని తీసుకొచ్చి కాటన్‌లో దాచి పెడుతున్నారని విద్యార్థులు చెబుతున్నారు. మరోవైపు ఉపాధ్యాయుడి టేబుల్‌పై మద్యం సీసాలు కనిపించడం ఈ వ్యవహారంపై మరింత చర్చకు దారితీసింది.

విద్యార్థుల ద్వారా విషయం తెలుసుకున్న గ్రామస్థులు సర్పంచ్‌తో కలిసి పాఠశాలకు చేరుకున్నారు. హెచ్ఎం వ్యవహారశైలిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎంఈవోకు ఫిర్యాదు చేశారు. విద్యార్థులకు విద్యాబోధన చేయాల్సిన ఉపాధ్యాయుడే ఇలా వ్యవహరిస్తే పిల్లలకు ఎలాంటి సందేశం వెళ్తుందని గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య ఎలా అందుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి సమగ్ర విచారణ చేపట్టాలని విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన వ్యవహారం ఉపాధ్యాయుని పైన కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.