Asifabad: ఆసిఫాబాద్ ఆసుపత్రి కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలి ఏఐటీయూసీ!
Asifabad: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసుపత్రి కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
Asifabad: ఆసిఫాబాద్ ఆసుపత్రి కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలి ఏఐటీయూసీ!
Asifabad: జిల్లా ప్రధాన ఆసుపత్రిలో పనిచేస్తున్న కార్మికుల పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. బీమ్ సొసైటీ ఆధ్వర్యంలో సుమారు 150 మంది సానిటేషన్ కార్మికులు, సెక్యూరిటీ గార్డులు, ఇతర సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు.
గత మూడు, నాలుగు నెలలుగా వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. వేతనాలు చెల్లించిన సమయంలోనూ పూర్తి జీతాలు ఇవ్వకుండా రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు మాత్రమే చెల్లిస్తున్నారని ఆరోపించారు. తాము విధుల్లో చేరినప్పటి నుంచి పీఎఫ్, ఈఎస్‌ఐ సమస్యలు కూడా పరిష్కారం కాలేదని పేర్కొన్నారు.
ఈ సమస్యలను గతంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాలేదని కార్మికులు తెలిపారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి సంబంధిత ఏజెన్సీని పిలిపించి పెండింగ్ వేతనాలతో పాటు పీఎఫ్, ఈఎస్‌ఐ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని నాయకులు హెచ్చరించారు.




