Mancherial: సింగరేణి కార్మికుల సమస్యలపై AITUC రెండు రోజుల నిరాహార దీక్షలు!
Mancherial: శ్రీరాంపూర్ జీఎం కార్యాలయం ఎదుట సింగరేణి కార్మికుల సమస్యలు, 210 డిపెండెంట్ ఉద్యోగాలు, రూ.60 వేల కోట్ల బకాయిల విడుదల కోసం AITUC రెండు రోజుల నిరాహార దీక్షలు చేపట్టింది.
Mancherial: సింగరేణి కార్మికుల సమస్యలపై AITUC రెండు రోజుల నిరాహార దీక్షలు!
Mancherial: మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌లో సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం AITUC ఆధ్వర్యంలో రెండు రోజుల నిరాహార దీక్షలు చేపట్టారు. నవంబర్ 18, 19 తేదీల్లో శ్రీరాంపూర్ జీఎం కార్యాలయం ఎదుట నిర్వహిస్తున్న ఈ దీక్షల్లో కార్మికుల సమస్యలను పరిష్కరించాలని నాయకులు డిమాండ్ చేశారు.
210 మంది డిపెండెంట్లకు వెంటనే నియామక పత్రాలు అందించాలని, ప్రతి నెలా మెడికల్ బోర్డు నిర్వహించి అర్హులైన కార్మికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థకు చెల్లించాల్సిన రూ.60 వేల కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా దీక్షలో పాల్గొన్న డిపెండెంట్ ఉద్యోగ అభ్యర్థులు తమకు ఉద్యోగాలు కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీటిపర్యంతమయ్యారు. ఎన్నో రోజులుగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నా తమ సమస్య పరిష్కారం కావడం లేదని వాపోయారు.
ఈ కార్యక్రమంలో AITUC అధ్యక్షుడు సీతారామయ్య, నాయకులు బాజీ, సైదాతో పాటు వివిధ కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.




