Asifabad: ఆడేపల్లి గ్రామ పంచాయతీలో ఘనంగా బతుకమ్మ సంబరాల ఏర్పాట్లు!
Asifabad: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం ఆడేపల్లి గ్రామ పంచాయతీలో బతుకమ్మ సంబరాలకు ఏర్పాట్లు వేగవంతమయ్యాయి.
Asifabad: ఆడేపల్లి గ్రామ పంచాయతీలో ఘనంగా బతుకమ్మ సంబరాల ఏర్పాట్లు!
Asifabad: బతుకమ్మ సంబరాలకు ముస్తాబవుతున్న ఆడేపల్లి గ్రామ పంచాయతీ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం ఆడేపల్లి గ్రామ పంచాయతీ బతుకమ్మ సంబరాలకు ముస్తాబవుతోంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించేందుకు గ్రామ పంచాయతీ అవసరమైన ఏర్పాట్లు చేపడుతోంది.
తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, పూల పండుగ వైభవానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలను విజయవంతంగా నిర్వహించేందుకు గ్రామ పంచాయతీ సన్నద్ధమవుతోంది. ప్రభుత్వం బతుకమ్మ సంబరాలకు పెద్దపీట వేయడంపై గ్రామ మహిళలు హర్షం వ్యక్తం చేస్తూ, సర్పంచ్, ఉప సర్పంచ్ తో పాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశంసించారు.
ఈ సందర్భంగా ఏర్పాట్లను గ్రామ సర్పంచ్ కోడెప సుగుణ భీంరావు, ఉప సర్పంచ్ అతికం మహేష్ గౌడ్, కాంగ్రెస్ వార్డు సభ్యులు భిక్షపతి, రాజేశ్వరి, గణేష్, మండల వైస్ ప్రెసిడెంట్ అంగోలా చిలకయ్య దుర్గం విజయ్ కుమార్ తదితరులు పాల్గొని పర్యవేక్షిస్తున్నారు.




