Mancherial: మంచిర్యాల వయోజన విద్యాశాఖ జిల్లా ఇన్‌చార్జిగా ఏ. పురుషోత్తం బాధ్యతలు

Mancherial: మంచిర్యాల జిల్లా వయోజన విద్యాశాఖ జిల్లా ఇన్‌చార్జిగా ఏ. పురుషోత్తం గురువారం బాధ్యతలు స్వీకరించి, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 12 Nov 2026 8:41 PM IST
Mancherial
X

Mancherial: మంచిర్యాల వయోజన విద్యాశాఖ జిల్లా ఇన్‌చార్జిగా ఏ. పురుషోత్తం బాధ్యతలు

మంచిర్యాల: మంచిర్యాల జిల్లా వయోజన విద్యాశాఖ జిల్లా ఇన్‌చార్జిగా నూతనంగా నియమితులైన ఏ. పురుషోత్తం గురువారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్‌ను మర్యాదపూర్వకంగా కలిసి తన నియామక వివరాలను తెలియజేశారు.

ఈ సందర్భంగా పురుషోత్తం మాట్లాడుతూ.. జిల్లాలో వయోజన విద్యా కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తానని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాల మేరకు ULLAS – నవ భారత్ సాక్షరత కార్యక్రమం ద్వారా నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానన్నారు. ప్రజల్లో విద్యపై అవగాహన పెంపొందించడంతో పాటు సంబంధిత శాఖల సమన్వయంతో కార్యక్రమాలను విజయవంతం చేస్తానని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా రిసోర్స్ పర్సన్లు ఏ. సత్యనారాయణమూర్తి, ఎం. సుమన్ తదితరులు పాల్గొని ఏ. పురుషోత్తంకు శుభాకాంక్షలు తెలిపారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.