Kannepalli: బతికే ఉన్నా చనిపోయినట్లు రికార్డులు.. పెన్షన్ నిలిపివేత!

Kannepalli: మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం వీరాపూర్‌కు చెందిన 80 ఏళ్ల వృద్ధుడు నికాడి బాపును రికార్డుల్లో చనిపోయినట్లు నమోదు చేసి పెన్షన్ నిలిపివేశారు.

PRATHAP, BELLAMPALLI
Published on: 31 Oct 2026 12:48 PM IST
Kannepalli
X

Kannepalli: బతికే ఉన్నా చనిపోయినట్లు రికార్డులు.. పెన్షన్ నిలిపివేత!

Kannepalli: కన్నెపల్లి మండలం వీరాపూర్ గ్రామానికి చెందిన నికాడి బాపు (సుమారు 80 సంవత్సరాలు) పెన్షన్ అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో నెలకు సుమారు రూ.200 పెన్షన్ అందేదని, దాదాపు ఐదేళ్ల పాటు పెన్షన్ పొందానని బాపు తెలిపారు. అయితే ఆ తర్వాత పెన్షన్ నిలిచిపోయిందని, విచారణ చేయగా తాను మరణించినట్లు రికార్డుల్లో నమోదు కావడంతో పెన్షన్ నిలిపివేసినట్లు అధికారులు తెలిపారని ఆవేదన వ్యక్తం చేశారు.

తాను బతికే ఉన్నానని పలుమార్లు అధికారులకు తెలియజేసి, పెన్షన్ పునరుద్ధరించాలని దరఖాస్తులు సమర్పించినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి ప్రయోజనం కలగలేదని వాపోయారు.

గత 30 సంవత్సరాలుగా కంటి చూపు కోల్పోయి ఇబ్బందులు పడుతున్నానని, ఈ మధ్య కాలంలో మూర్ఛ వ్యాధి కూడా వస్తోందని, మూర్ఛ వచ్చిన ప్రతిసారీ ఆసుపత్రికి వెళ్లాల్సి వస్తోందని తన బాధను వివరించారు. వృద్ధాప్యంలో అనారోగ్య సమస్యలతో పాటు ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నానని ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత అధికారులు మానవతా దృక్పథంతో తన పరిస్థితిని పరిశీలించి, రికార్డుల్లో ఉన్న మరణించినట్లు నమోదైన వివరాలను సరిచేసి, అర్హత ప్రకారం పెన్షన్ మంజూరు చేసి ఆదుకోవాలని నికాడి బాపు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

PRATHAP, BELLAMPALLI

PRATHAP, BELLAMPALLI