Chintalamanepally: చింతలమానేపల్లిలో ఘనంగా 77వ భారత రాజ్యాంగ దినోత్సవం!

Chintalamanepally: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లిలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు డుబ్బుల నానయ్య ఆధ్వర్యంలో గురువారం 77వ రాజ్యాంగ దినోత్సవం జరిగింది.

SRINIVAS, KOUTALA
Published on: 26 Nov 2026 10:52 PM IST
Chintalamanepally
X

Chintalamanepally: చింతలమానేపల్లిలో ఘనంగా 77వ భారత రాజ్యాంగ దినోత్సవం!

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా: చింతలమానేపల్లి మండల కేంద్రంలో 77వ భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు డబ్బుల నానయ్య ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. చింతలమానేపల్లి మండల కేంద్రంలో 77వ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు.

ఈ సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చిత్రపటానికి నివాళులర్పించారు. ఆయన చేసిన గొప్ప కృషి, త్యాగాలు, సమాజానికి అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు.

అనంతరం భారత రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ, రాజ్యాంగం ప్రతి పౌరుడికి కల్పించిన సమానత్వపు హక్కులు, స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సౌభ్రాతృత్వం వంటి విలువల గురించి వివరించారు. కుల, మత, ప్రాంత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు కల్పించిన గొప్ప ప్రజాస్వామ్య గ్రంథం మన భారత రాజ్యాంగమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు డుబ్బుల నానయ్య, సర్పంచ్ తనయుడు మేకల ప్రసాద్, ఉపసర్పంచ్ శ్రీనివాస్, సామాజిక బహుజన నేత జాడి దిలీప్, దుర్గం విజయ్ కుమార్, భూపతి, గుర్ల అశోక్ మరియు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

SRINIVAS, KOUTALA

SRINIVAS, KOUTALA