Asifabad: సద్దుల బతుకమ్మ వేడుకల్లో తీవ్ర విషాదం బతుకమ్మ ఆడుతూ యువతి మృతి!
Asifabad: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బూరుగుడ గ్రామంలో సద్దుల బతుకమ్మ ఆడుతుండగా యువతి స్పృహతప్పి పడిపోయి ప్రాణాలు కోల్పోయింది.
Asifabad: సద్దుల బతుకమ్మ వేడుకల్లో తీవ్ర విషాదం బతుకమ్మ ఆడుతూ యువతి మృతి!
Asifabad: సద్దుల బతుకమ్మ సంబరాలు ఓ కుటుంబంలో విషాదాన్ని నింపాయి. ఆసిఫాబాద్ మండలం బూరుగుడ గ్రామంలో బతుకమ్మ ఆడుతున్న సమయంలో యువతి స్పృహతప్పి కిందపడటంతో ప్రాణాలు కోల్పోయింది. చింతలమానేపల్లి మండలం బాబాసాగర్‌కు చెందిన శ్రీవాణి (25) బతుకమ్మ వేడుకల్లో పాల్గొనేందుకు తన మేనత్త ఇంటికి వచ్చింది. ఈ క్రమంలో బతుకమ్మ ఆడుతుండగా అకస్మాత్తుగా స్పృహతప్పి పడిపోయింది.
గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే ఆమెను ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే శ్రీవాణి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించినట్లు స్థానికులు తెలిపారు. చెన్నైలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న శ్రీవాణి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. పండుగ వేళ చోటుచేసుకున్న ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.




