Devarakadra: KCR మళ్లీ సీఎం కావాలని గజ్వేల్‌కు పాదయాత్ర చేపట్టిన యువకుడు!
Devarakadra: దేవరకద్ర మండలం గూరకొండ గ్రామానికి చెందిన చిన్న నరసింహ అనే యువకుడు KCR మళ్లీ సీఎం కావాలని కాళ్లకు చెప్పులు లేకుండా గజ్వేల్ వరకు పాదయాత్ర చేపట్టారు.
Devarakadra: KCR మళ్లీ సీఎం కావాలని గజ్వేల్‌కు పాదయాత్ర చేపట్టిన యువకుడు!
Devarakadra: మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం గూరకొండ గ్రామ యువ నాయకుడు చిన్న నరసింహ కేసీఆర్ మీద అభిమానంతో, అలాగే 2028 లో మళ్ళీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గా కేసీఆర్ గెలవాలనే సంకల్పంతో సోమవారం రోజు తన స్వగ్రామం గూరకొండ నుంచి చెప్పులు కూడా లేకుండా పాదయాత్రగా బయలుదేరి గజ్వేల్ లోని కేసీఆర్ నివాసం వరకు పాదయాత్ర ప్రారంభించాడు.
దేవరకద్రకు చేరుకోగానే దేవరకద్ర మున్సిపాలిటీ 11 వార్డు కౌన్సెలర్ వడ్డె రాధా కొండల్ స్వాగతం పలికి శాలువా కప్పి సన్మానించి అతనితోపాటు కొద్ది దూరం పాదయాత్ర చేశారు. అనంతరం మళ్లీ గజ్వేల్ కు బయలుదేరిన చిన్న నరసింహులు. ఈ కార్యక్రమంలో స్థానిక బిఆర్ఎస్ నాయకులు అడ్డు, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.




