Veldanda: పోతేపల్లిలో ఘనంగా సదర్ ఉత్సవాలు!
Veldanda: పోతేపల్లి గ్రామంలో సర్పంచ్ తగుళ్ల కొండల్ యాదవ్, బీఆర్ఎస్ నేత అంజి మాస్టర్ ఆధ్వర్యంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో సదర్ ఉత్సవాలు ఘనంగా జరిగాయి.
Veldanda: పోతేపల్లిలో ఘనంగా సదర్ ఉత్సవాలు!
Veldanda: నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండలం పోతేపల్లి గ్రామంలో యాదవుల ఆధ్వర్యంలో గురువారం యాదవులు సదర్ ఉత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యాదవ సంఘం పెద్దలు, యువకులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
పోతేపల్లి గ్రామ సర్పంచ్ తగుళ్ల కొండల్ యాదవ్, బిఆర్ఎస్ మండల నాయకుడు అంజి మాస్టర్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ముందుండి నడిపించారు. ఈ సదర్ కార్యక్రమాన్ని విజయవంతం కావడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ అంజి మాస్టర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
యాదవ సంఘం ఐక్యత, ఐకమత్యం మరింత బలోపేతం కావాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ఈ సదర్ కార్యక్రమం విజయవంతం కావడంలో పోతేపల్లి గ్రామానికి చెందిన యాదవ ముద్దుబిడ్డలు రామస్వామి యాదవ్, ముంత మల్లేష్ యాదవ్, కడారి శ్రీకాంత్ యాదవ్, జగదీష్ యాదవ్, బోయిన మల్లేష్ యాదవ్ కీలక పాత్ర పోషించారు.
అలాగే వార్డు మెంబర్ వావిళ్ల యాదగిరి యాదవ్, బాలు యాదవ్, ఉడుత శివ యాదవ్, శేఖర్ యాదవ్, వేణు యాదవ్, మల్లేష్ యాదవ్, మహేష్ యాదవ్, లింగం సాయిల్ యాదవ్, శ్రీకాంత్ యాదవ్, ఎం. అల్లాజి యాదవ్, ఉడుత తిరుపతయ్య యాదవ్, నూనె వంశీ యాదవ్ తదితరులు పాల్గొని తమ సహకారం అందించారు.




