Narayanpet: మాతృ మరణాల నివారణకు సమన్వయంతో పనిచేయాలి: డీఎంహెచ్‌ఓ!

Narayanpet: మాతృ మరణాల నివారణకు వైద్య సిబ్బంది సమన్వయంతో పనిచేసి హైరిస్క్ గర్భిణులను పర్యవేక్షించాలని నారాయణపేట డీఎంహెచ్‌ఓ డాక్టర్ జయచంద్ర మోహన్ ఆదేశించారు.

P.HANMANTHU, NARAYANAPETA
Published on: 23 Nov 2026 6:49 PM IST
Narayanpet
X

Narayanpet: మాతృ మరణాల నివారణకు సమన్వయంతో పనిచేయాలి: డీఎంహెచ్‌ఓ!

నారాయణపేట జిల్లా: నారాయణపేట జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో ఈరోజు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కె. జయచంద్ర మోహన్ అధ్యక్షతన మాతృ మరణాల సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో జిల్లాలో నమోదైన మాతృ మరణాల కేసులను సమగ్రంగా సమీక్షించి, మరణాలకు గల కారణాలు, సంబంధిత పరిస్థితులు, వైద్య సేవల్లో ఎదురైన సమస్యలు, గర్భిణులకు అందుతున్న వైద్య సేవలు, సకాలంలో రిఫరల్ చేయడం వంటి అంశాలపై చర్చించారు.

ఈ సందర్భంగా DM&HO డాక్టర్ కె. జయచంద్ర మోహన్ మాట్లాడుతూ, మాతృ మరణాలను నివారించడానికి ప్రతి గర్భిణిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ముఖ్యంగా హైరిస్క్ గర్భిణులను ముందుగానే గుర్తించి నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. టెరిషరి హాస్పిటల్స్ లో కాన్పులు జరిగేలా చూడాలని గర్భిణులకు నిర్ణీత సమయంలో అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వైద్య సేవలు అందించాలని, అత్యవసర పరిస్థితుల్లో ఏమాత్రం ఆలస్యం చేయకుండా మెరుగైన వైద్య సదుపాయాలున్న ఆసుపత్రులకు రిఫర్ చేయాలని ఆదేశించారు.

అలాగే PHC వైద్యాధికారులు, ANMలు మరియు ఆశా కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ గర్భిణుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, ప్రసవ సమయంలో తలెత్తే సమస్యలను ముందుగానే గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ సమావేశంలో డాక్టర్ కె. సిద్ధప్ప, డిప్యూటీ DM&HO, డాక్టర్ కిష్టమ్మ, ప్రోగ్రామ్ ఆఫీసర్ (MHN), డాక్టర్ లక్ష్మీపద్మ ప్రియ, గైనకాలజిస్ట్, డాక్టర్ హిమజ, గైనకాలజిస్ట్, డాక్టర్ మహేంద్ర వర్మ, పీడియాట్రిషియన్, అరవింద్, MHN ప్రోగ్రామ్ కోఆర్డినేటర్, సంబంధిత PHC వైద్యాధికారులు, ANMలు మరియు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

P.HANMANTHU, NARAYANAPETA

P.HANMANTHU, NARAYANAPETA