Achampet: అచ్చంపేటలో విద్యార్థులకు వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన

Achampet: అచ్చంపేట సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్‌లో విద్యార్థులకు వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన కార్యక్రమం, అపోలో ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.

V. RAVINDR GOUD, ACCHAMPETA
Published on: 13 Nov 2026 6:10 PM IST
Achampet
X

Achampet: అచ్చంపేటలో విద్యార్థులకు వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన

అచ్చంపేట: సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ అచ్చంపేటలో విద్యార్థులకు వన్యప్రాణుల సంరక్షణ, అటవీ పరిరక్షణ మరియు పర్యావరణ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా వైల్డ్‌లైఫ్ అవేర్‌నెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు అడవుల ప్రాముఖ్యత, వన్యప్రాణుల జీవన విధానం, జీవవైవిధ్య పరిరక్షణ, వన్యప్రాణుల ఆవాసాల సంరక్షణ, మానవ - వన్యప్రాణుల మధ్య సంఘర్షణ నివారణ వంటి అంశాలపై అవగాహన కల్పించారు. వన్యప్రాణులను రక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రకృతిలో ప్రతి జీవికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉందని వివరించారు.

అదేవిధంగా అపోలో ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణను దృష్టిలో ఉంచుకొని ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో వైద్యులు విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వైద్య సలహాలు అందించారు. అలాగే విద్యార్థులకు ఉచితంగా మందులను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, డాక్టర్ రాజశేఖర్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ హనుమంతు నాయక్, అపోలో ఫౌండేషన్ వైద్య బృందం మరియు పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.

అచ్చంపేట సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ లో విద్యార్థులకు వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన కల్పిస్తున్న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ హనుమంతు నాయక్, ఉపాధ్యాయులు.

V. RAVINDR GOUD, ACCHAMPETA

V. RAVINDR GOUD, ACCHAMPETA