Vangoor: తెలంగాణ నీళ్లను ఆంధ్ర వాళ్లు తరలిస్తుంటే సీఎం మౌనమేల: ప్రవీణ్ కుమార్!

Vangoor: తెలంగాణ నీళ్లను ఏపీ తరలిస్తుంటే సీఎం రేవంత్ రెడ్డి మౌనంగా ఉన్నారని నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరులో ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ బుధవారం విమర్శించారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 25 Nov 2026 8:47 PM IST
Vangoor
X

Vangoor: తెలంగాణ నీళ్లను ఆంధ్ర వాళ్లు తరలిస్తుంటే సీఎం మౌనమేల: ప్రవీణ్ కుమార్!

నాగర్ కర్నూల్ జిల్లా: వంగూరు మండల కేంద్రంలో :తెలంగాణ జలవనరులను ఆంధ్రప్రదేశ్‌కు తరలిస్తుంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారని బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు.ఆంధ్ర సీఎం చంద్రబాబుతో కుమ్మక్కై తెలంగాణ ప్రయోజనాలకు తూట్లు పొడుస్తున్నారా అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

పాలమూరు బిడ్డనని చెప్పుకుంటూ పాలమూరు ప్రాంతానికే అన్యాయం చేయడం ఏమిటని నిలదీశారు.రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై బుధవారం వంగూరు మండల కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కృష్ణా జలాల విషయంలో తెలంగాణ హక్కులను కాపాడాల్సిన బాధ్యత సీఎం రేవంత్ రెడ్డి,పై ఉందని,కానీ ఆంధ్రప్రదేశ్‌కు నీటి తరలింపు జరుగుతున్నా అడ్డుకునే చర్యలు కనిపించడం లేదని ప్రవీణ్ కుమార్ విమర్శించారు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడాల్సిన సీఎం, ఆంధ్ర సీఎం,కు ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నారా అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.

అచ్చంపేట,సాగునీటి ప్రాజెక్టులకు చేసింది జీరో అచ్చంపేట నియోజకవర్గ సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం సాధించిన పురోగతి శూన్యమని విమర్శించారు. రైతులకు సాగునీరు అందిస్తామని ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు.ప్రాజెక్టుల పనులు ఎప్పుడు ప్రారంభిస్తారు...రైతులకు నీళ్లు ఎప్పుడు అందిస్తారో ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.

నల్లమల ప్రజలకు సమాధానం చెప్పాలి.

నల్లమల ప్రాంత అభివృద్ధి, ప్రజల సంక్షేమం,మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని అన్నారు.పాలమూరు అభివృద్ధి పేరుతో కొండారెడ్డిపల్లి ఒక్క గ్రామానికే అభివృద్ధి పరిమితం చేస్తారా.మిగతా ప్రాంతాల పరిస్థితి ఏమిటని నిలదీశారు.చెంచు బిడ్డల పోడు భూములకు పట్టాలెక్కడ..

అడవుల్లో జీవిస్తున్న చెంచు గిరిజనులకు పోడు భూముల పట్టాలు ఇస్తామని చెప్పిన హామీ ఏమైందని ప్రశ్నించారు. గిరిజనుల భూమి హక్కులు, జీవనోపాధి, సంక్షేమం విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. చెంచు కుటుంబాలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలులోకి రాకపోవడంపై సీఎం తీరును విమర్శించారు. హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరించడం ప్రజలను మోసం చేయడమేనని, రేవంత్ రెడ్డి పాలన హామీలకే పరిమితమైందని ఘాటుగా వ్యాఖ్యానించారు.

45 సోలార్ పంపుసెట్లు ఇస్తామన్నారు.. ఇచ్చింది 14 మాత్రమే!

గిరిపుత్రులకు సోలార్ పంపుసెట్లు అందిస్తామని హామీ ఇచ్చి 45 పంపుసెట్లు ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం కేవలం 14 మాత్రమే అందించిందని ఆరోపించారు. మిగిలిన 31 పంపుసెట్లు ఎక్కడున్నాయని ప్రశ్నించారు. గిరిజనులకు ఇచ్చిన హామీల అమలులో ఈ నిర్లక్ష్యం ఎందుకని నిలదీశారు.

నల్లమల అభివృద్ధికి రూ.600 కోట్లు ఏమయ్యాయి..

నల్లమల అభివృద్ధికి రూ.600 కోట్లు కేటాయిస్తామని, ఐటీడీఏలో ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ హామీలకు సంబంధించిన జీవోలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిధుల కేటాయింపు, వినియోగం, ఉద్యోగాల భర్తీ వివరాలను ప్రజలకు వెల్లడించాలని అన్నారు.

రాజీవ్ యువ వికాసం రుణాలెన్ని మంజూరు చేశారన్నారు.

రాజీవ్ యువ వికాసం పథకం కింద ఎంతమంది యువతకు రుణాలు మంజూరు చేశారనీ గజమెత్తారు.ఎంతమంది లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందించారని ప్రభుత్వం ఆ విశాలన్నిటిని బయటపెట్టాలని డిమాండ్ చేశారు. యువతకు ఉపాధి కల్పిస్తామని చెప్పి క్షేత్రస్థాయిలో ఎంతమేర అమలు చేశారో వెల్లడించాలని అన్నారు.

అభివృద్ధి దేవుడెరుగు.. దుందుభి వాగులో ఇసుక దందా జోరు

నల్లమల, పాలమూరు ప్రాంత అభివృద్ధిని పట్టించుకోకుండా దుందుభి వాగులో ఇసుక దందా మాత్రం జోరుగా సాగుతోందని ఆరోపించారు.సహజ వనరులను అక్రమంగా తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు.ఏసీబీ అధికారులే లంచాలు అడగడం విడ్డూరం

అవినీతిని అరికట్టాల్సిన ఏసీబీ అధికారులే లంచాలుఅడుగుతున్నారనే ఆరోపణలు రావడం ప్రభుత్వ పాలనలోని లోపాలకు నిదర్శనమని విమర్శించారు.అవినీతి ఆరోపణలపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.గురుకుల విద్యార్థుల మరణాల ఘటనలను ప్రస్తావిస్తూ సీఎం రేవంత్ రెడ్డి అసమర్థ పాలనలో విద్యార్థుల భద్రత ప్రశ్నార్థకంగా మారిందని ఆరోపించారు. సుమారు 150 మంది గురుకుల విద్యార్థుల మరణాల అంశంపై ప్రభుత్వం బాధ్యత వహించాలని, విద్యార్థుల భద్రత, వసతులు, ఆహార నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు.

హామీలు అమలు చేయాలి.. ప్రజలకు జవాబు చెప్పాలి

పాలమూరు, నల్లమల ప్రాంతాలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మభ్యపెట్టడం సరికాదని డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ అన్నారు. సాగునీరు, గిరిజన హక్కులు, యువత ఉపాధి, అభివృద్ధి నిధులు, విద్యార్థుల భద్రతపై ప్రభుత్వం స్పష్టమైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్,మర్రి జనార్దన్ రెడ్డి,తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి, అచ్చంపేట మున్సిపల్ మాజీ చైర్మన్ ఎడ్ల నరసింహ గౌడ్, బిఆర్ఎస్ నాయకులు గణేష్ రావు,కొమ్ము శ్రీనివాసులు,జాజాల సర్పంచ్ జిలకర కాశమ్మ, సత్యం,జంగయ్య, తదితరులు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY