Wanaparthy: మిట్టాంజనేయ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో ఇరుముడి కార్యక్రమం

Wanaparthy: వనపర్తి జిల్లా పెబ్బేరులో శ్రీ మిట్టాంజనేయ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో ఇరుముడి కార్యక్రమం ఘనంగా జరిగింది. ముగ్గురు స్వాములు బైక్‌పై శబరిమల యాత్ర ప్రారంభించారు.

G. BALAVARDHAN, PEBBERU
Published on: 23 Nov 2026 9:57 AM IST
Wanaparthy
X

Wanaparthy: మిట్టాంజనేయ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో ఇరుముడి కార్యక్రమం

వనపర్తి: శ్రీశ్రీశ్రీ మిట్టాంజనేయ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో ఇరుముడి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మేకల ఎల్లయ్య గురుస్వామి ఆధ్వర్యంలో అర్చకులు గోవర్ధన్ ఆచారి గురుస్వామి, డాక్టర్ రాఘవేంద్ర రెడ్డి స్వామి, బిట్టు స్వామి ఇరుముడి ధరించి పెబ్బేరు నుంచి బైక్ శబరిమల యాత్రను ప్రారంభించారు.

ఈ సందర్భంగా గోవర్ధన్ ఆచారి మాట్లాడుతూ.. శబరిమల యాత్రలో భాగంగా మార్గమధ్యంలో ఉన్న వివిధ పుణ్యక్షేత్రాలు, ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు. రెండు రోజుల్లో శబరిమల చేరుకుని, పవిత్రమైన ఇరుముడితో పద్దెనిమిది పవిత్ర మెట్లు (పదునెట్టాంబడి) ఎక్కి అయ్యప్ప స్వామిని దర్శించుకోనున్నట్లు వెల్లడించారు. అయ్యప్ప స్వామి ఆశీస్సులతో బైక్ యాత్ర విజయవంతంగా కొనసాగాలని పెబ్బేరు అయ్యప్ప స్వామి భక్తులు ఆకాంక్షించారు. యాత్రికులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

G. BALAVARDHAN, PEBBERU

G. BALAVARDHAN, PEBBERU