Pebbair: పెబ్బేరు బీచుపల్లి బ్రిడ్జిపై ట్రావెల్స్ బస్సును ఢీకొన్న లారీ!

Pebbair: వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం రంగాపురం సమీపంలోని బీచుపల్లి బ్రిడ్జిపై గురువారం సాయంత్రం ట్రావెల్స్ బస్సును వెనుక నుంచి లారీ ఢీకొట్టడంతో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు.

G. BALAVARDHAN, PEBBERU
Published on: 20 Nov 2026 7:04 AM IST
Pebbair
X

Pebbair: పెబ్బేరు బీచుపల్లి బ్రిడ్జిపై ట్రావెల్స్ బస్సును ఢీకొన్న లారీ!

పెబ్బేరు: పెబ్బేరు మండలం రంగాపురం సమీపంలోని బీచుపల్లి బ్రిడ్జిపై గురువారం సాయంత్రం ట్రావెల్స్ బస్సును వెనక నుంచి లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న పలువురు గాయపడ్డారు. స్థానికులు 108కు సమాచారం అందించడంతో ఘటనాస్థలికి చేరుకున్న సిబ్బంది క్షతగాత్రులను పెబ్బేరు PHCకి తరలించారు.

కరీంనగర్ జిల్లా కేంద్రానికి చెందిన వారు కర్నూల్‌లోని ఒక శుభకార్యానికి హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

G. BALAVARDHAN, PEBBERU

G. BALAVARDHAN, PEBBERU