Kothakota: లలితా త్రిపురసుందరిగా దర్శనమిచ్చిన అమ్మవార్లు!

Kothakota: కొత్తకోట పట్టణంలోని అంబా భవానీ, వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయాల్లో అమ్మవార్లు లలితా త్రిపురసుందరి దేవిగా దర్శనమిచ్చారు.

B. KISHORE KUMAR, KOTTHAKOTA
Published on: 15 Oct 2026 3:54 PM IST
Kothakota
X

Kothakota: లలితా త్రిపురసుందరిగా దర్శనమిచ్చిన అమ్మవార్లు!

కొత్తకోట: దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఐదవ రోజు గురువారం కొత్తకోట పట్టణంలోని శ్రీ అంబా భవానీ దేవాలయం, శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవాలయాల్లో అమ్మవార్లను శ్రీ లలితా త్రిపురసుందరి దేవిగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు.

ఈ సందర్భంగా ఉదయం నుంచే ఆలయాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆలయాల్లో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాలు, కుంకుమార్చనల్లో భక్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేశారు.

ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అమ్మవార్ల దర్శనంతో ఆలయాలు భక్తజన సందోహంతో సందడిగా మారాయి.

B. KISHORE KUMAR, KOTTHAKOTA

B. KISHORE KUMAR, KOTTHAKOTA