Wanaparthy: కొత్తకోట 4వ వార్డులో పట్టభద్రుల ఓటరు నమోదు డ్రైవ్!

Wanaparthy: వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణంలోని 4వ వార్డులో బీఆర్‌ఎస్ నాయకులు ఇంటింటికీ తిరుగుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై విస్తృత అవగాహన కల్పించారు.

B. KISHORE KUMAR, KOTTHAKOTA
Published on: 29 Oct 2026 9:13 PM IST
Wanaparthy
X

Wanaparthy: కొత్తకోట 4వ వార్డులో పట్టభద్రుల ఓటరు నమోదు డ్రైవ్!

వనపర్తి: కొత్తకోట పట్టణంలోని 4వ వార్డులో మాజీ జడ్పీటీసీ పొగాకు విశ్వేశ్వర్, వార్డు కౌన్సిలర్ ఎరుకలి తిరుపతయ్య, మాజీ వార్డు సభ్యుడు సింధూ వెంకటేష్ ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ నాయకులు ఇంటింటికీ తిరుగుతూ పట్టభద్రుల వివరాలను సేకరించారు.

పట్టభద్రుల ఓటరు నమోదు గడువు సమీపిస్తున్న నేపథ్యంలో అర్హులైన ప్రతి ఒక్కరూ వెంటనే తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమానికి 4వ వార్డులోని పట్టభద్రుల నుంచి విశేష స్పందన లభించిందని బీఆర్‌ఎస్ శ్రేణులు తెలిపారు.

B. KISHORE KUMAR, KOTTHAKOTA

B. KISHORE KUMAR, KOTTHAKOTA