Wanaparthy: రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్న కాంగ్రెస్ను తరిమికొడదాం: బీఆర్ఎస్!
Wanaparthy: భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని వనపర్తి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి బీఆర్ఎస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాంగ్రెస్ పాలనపై నేతలు విమర్శలు గుప్పించారు.
Wanaparthy: రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్న కాంగ్రెస్ను తరిమికొడదాం: బీఆర్ఎస్!
వనపర్తి: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి సారథ్యంలో రూపొందించిన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 3 ద్వారా నూతన రాష్ట్రాల ఏర్పాటుకు ఆనాడే అవకాశం కల్పించారని గుర్తుచేశారు. ఆ రాజ్యాంగ స్ఫూర్తితోనే కేసీఆర్ గారు 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని పేర్కొన్నారు. నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి హయాంలో హైదరాబాద్లో 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి, అంబేద్కర్ స్ఫూర్తిని దేశానికి చాటిచెప్పారని గుర్తుచేశారు.
రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం..
రాజ్యాంగ విలువలను పరిరక్షించాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వమే వాటిని తుంగలో తొక్కుతోందని విమర్శించారు. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. తెలంగాణలో తిరిగి కేసీఆర్ గారి పాలన రావాలని, వనపర్తిలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారి నాయకత్వం కొనసాగాలని ఆకాంక్షించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగిస్తూ రాజ్యాంగ హక్కులను, ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు గంధం పరంజ్యోతి, పెండెం నాగన్న యాదవ్, విజయ్ కుమార్, చిట్యాల రాము, జోహెబ్, మాధవపల్లి సునీల్, సయ్యద్ జమీల్, మంద రాము, అస్లాం, అలీమ్, మాసాని సుధీర్, సాదిక్, ఖాదర్శ, ఇంతియాజ్, నవాజ్, సోహెల్, అనుపటి రాము, సూగురు రామస్వామి, కరుణాకర్, వజ్రాల రమేష్ తదితరులు పాల్గొన్నారు.




