Wanaparthy: పెబ్బేరు పాలిటెక్నిక్ హాస్టల్‌లో 50 మంది విద్యార్థినుల అస్వస్థత

Wanaparthy: వనపర్తి జిల్లా పెబ్బేరు మహిళా పాలిటెక్నిక్ కళాశాల హాస్టల్‌లో డిన్నర్ తిన్న తర్వాత దాదాపు 50 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

G. BALAVARDHAN, PEBBERU
Published on: 8 Oct 2026 3:02 PM IST
Wanaparthy
X

Wanaparthy: పెబ్బేరు పాలిటెక్నిక్ హాస్టల్‌లో 50 మంది విద్యార్థినుల అస్వస్థత

Wanaparthy: వనపర్తి జిల్లా పెబ్బేరు పట్టణ శివారులోని మహిళా పాలిటెక్నిక్ కళాశాల హాస్టల్‌లో బుధవారం రాత్రి డిన్నర్‌లో చికెన్ తిన్న అనంతరం 40 నుంచి 50 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైనట్లు సమాచారం.

విద్యార్థినులకు వాంతులు, జ్వరం, నీరసం వంటి అనారోగ్య లక్షణాలు కనిపించడంతో పలువురిని పెబ్బేరు పీహెచ్‌సీకి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే ఇది ఫుడ్ పాయిజనింగ్ కాదని, వైరల్ ఫీవర్ అంటూ ఘటనను తక్కువ చేసి చూపించే ప్రయత్నం జరుగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మరోవైపు హాస్టల్‌లో హెల్త్ క్యాంప్ నిర్వహించినట్లు అధికారులు చెబుతుండగా, అసలు హెల్త్ క్యాంప్ గురించి తనకు తెలియదంటూ కాలేజీ ప్రిన్సిపల్ చెప్పడం చర్చనీయాంశంగా మారింది.

విద్యార్థినులు అస్వస్థతకు గురైన విషయం వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ కావడంతో పెబ్బేరు మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ దయాకర్ రెడ్డి తదితరులు కళాశాలను సందర్శించి విద్యార్థులను పరామర్శించారు.

తీవ్ర అస్వస్థతకు గురైన ఓ విద్యార్థినిని వెంటనే పెబ్బేరు పీహెచ్‌సీకి తరలించి చికిత్స అందించారు.

ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి, విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిపై స్పష్టత ఇవ్వాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.

G. BALAVARDHAN, PEBBERU

G. BALAVARDHAN, PEBBERU