Nagarkurnool: నాగర్‌కర్నూల్‌లో 'ఓట్ బచావో - దేశ్ బచావో' సన్నాహక భేటీ

Nagarkurnool: నాగర్‌కర్నూల్‌లో డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఆధ్వర్యంలో 'ఓట్ బచావో - దేశ్ బచావో' సమీక్ష జరిగింది. నవంబర్ 1న భారీ ర్యాలీకి పిలుపునిచ్చారు.

GUNTI SAILU SAGAR, NAGAR KURNOOL
Published on: 25 Oct 2026 10:07 PM IST
Nagarkurnool
X

Nagarkurnool: నాగర్‌కర్నూల్‌లో 'ఓట్ బచావో - దేశ్ బచావో' సన్నాహక భేటీ

నాగర్ కర్నూలు జిల్లా: జిల్లా కేంద్రంలో. కాంగ్రెస్ పార్టీ మరియు 'ఇండియా' (INDIA) కూటమి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ఓట్ బచావో - దేశ్ బచావో' (సేవ్ డెమోక్రసీ) ఉద్యమ పురోగతి, రాబోయే నిరసనలపై అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (AICC) కీలక సమీక్షా సమావేశాలను నిర్వహిస్తూ కార్యాచరణను వేగవంతం చేస్తోంది...*_

ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు వోటు బచావో - దేశ్ బచావో సమీక్ష సమావేశం... డీసీసీ అధ్యక్షుడు, MLA డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.

•ఏఐసీసీ పరిశీలకులు రవీంద్ర దాస్

•నాగర్ కర్నూల్ పార్లమెంట్ సర్ ఇంచార్జి సిద్దేశ్వర

•స్థానిక ఎమ్మెల్యే కుచుకుల్ల రాజేష్ రెడ్డి

•కల్వకుర్తి ఎమ్మెల్యే కసి రెడ్డి నారాయణ రెడ్డి

మరియు ముఖ్య నాయకులు

రాంలీలా మైదానంలో నిర్వహించ తలపెట్టిన "ఓట్ బచావో - దేశ్ బచావో" మెగా ర్యాలీ

నవంబర్ 1న జరగబోయే ఈ భారీ ర్యాలీకి జిల్లా, బ్లాక్ స్థాయిల నుండి భారీగా జన సమీకరణ చేయాలని.. కోరారు.

సుదీర్ఘ పోరాటానికి రాహుల్ గాంధీ పిలుపు: ఏఐసీసీ సమావేశంలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఈ వ్యవస్థ సవరించబడే వరకు మరియు సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ను తొలగించే వరకు ఈ నిరసనలు నిరంతరాయంగా, దూకుడుగా సాగాలని స్పష్టం చేశారు.

GUNTI SAILU SAGAR, NAGAR KURNOOL

GUNTI SAILU SAGAR, NAGAR KURNOOL